తెలంగాణ రాష్ట్రంలో మొన్న రాత్రి నుంచి గాంధీ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు ఆందోళనను విరమించారు. మంత్రి ఈటల రాజేందర్ వారితో జరిపిన చర్చలు ఫలించటంతో వారు తిరిగి విధుల్లో చేరారు. మంత్రి జూనియర్ డాక్టర్లకు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కడం సరికాదని సూచనలు చేశారు. జూడాల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 
 
వైద్యులపై దాడి జరిగితే ఎవరినీ ఉపేక్షించబోమని హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు తిరిగి విధుల్లో చేరడానికి అంగీకరించారు. రెండు రోజుల క్రితం రోగి తరపు బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేయడంతో జూడాలు ఆందోళనకు దిగారు. జూడాలు ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి ఈటల జూనియర్ డాక్టర్లకు పలు సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: