టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో బన్నీ వాస్ ఒకరు. బన్నీకి మంచి స్నేహితుడు కావడంతో ఆయనను బన్నీ వాస్ అని పిలుస్తారు. గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న బన్నీ వాస్ పుట్టినరోజు నేడు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్ సినిమాలకు బన్నీ వాస్ నిర్మాణ సారధ్యం వహించారు. 
 
జానీ చిత్రం యొక్క లోగో యానిమేషన్ కోసం అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ దగ్గర చేరిన బన్నీ వాస్ క్రమంగా గీతా ఆర్ట్స్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. పాలకొల్లు వాసి అయిన బన్నీ వాస్ యూవీ క్రియేషన్స్ తో కలిసి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 57 చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. బన్నీ వాస్ పంపిణీ చేసిన సినిమాలలో ఆర్య, మగధీర, పోకిరి, మగధీర, ఇతర సినిమాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: