చాలా రోజుల తర్వాత ఏపీ కేబినెట్ ఈరోజు భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో సమావేశం జరగనుంది. ఇసుక, మద్యం అమ్మకాల నియంత్రణ కొరకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, విలేజ్ క్లినిక్ లు మొత్తం 40 అంశాలపై కేబినెట్ చర్చలు జరిపి ఆమోదముద్ర వేయనుంది. నూతన పారిశ్రామిక విధానానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఈరోజు ప్రధానంగా 45 - 60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు రూ. 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే వైయస్సార్ చేయూత పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరు వ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకం... పోలీస్ శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల మంజూరు... పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లు... తెలుగు అకాడమీ ఏర్పాటు... వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ.... కురపాం ఇంజినీరింగ్ కాలేజీ, మూడు నర్సింగ్ కాలేజీల అనుమతి గురించి ప్రధానంగా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: