గాంధీ ఆస్పత్రిలో కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని  అన్నారు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శోభన్‌బాబు. ఆయన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఆధునిక వైద్య యంత్రాల సహాయంతో నవజాత శిశు మరణాలను నియంత్రించవచ్చని వ్యాఖ్యానించారు. 

 

లక్షలాది రూపాయల విలువ చేసే కార్పొరేట్‌ స్థాయిలో ఆధునిక వైద్య పరికరాలు నియోనెటాల్‌ రెస్పరేటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్లు, గైనకాలజీ విభాగానికి అందించడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఇక గాంధీ ఆస్పత్రిలో సమర్ధవంతంగా కరోనా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రోగులు ఎవరూ కూడా భయపడవద్దు అని పేర్కొన్నారు. డాక్టర్ల పై దాడులు సరైన చర్య కాదని అన్నారు అయన.

మరింత సమాచారం తెలుసుకోండి: