హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతూనే ఉంది.  గాంధీ ఆస్పత్రికి కరోనా భారం తగ్గించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కరోనా భారం తగ్గించే విషయం లో స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా తాము ఏ మాత్రం వెనక్కు తగ్గేది లేదు అని చెప్తున్నారు. స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే తాము విధుల్లోకి చేరతామని చెప్తున్నారు.

 

దీనిపై మంత్రి ఈటెల రాజేంద్ర చర్చలు జరిపినా సరే పెద్దగా ఫలితం లేదు. దీనితో నేడు మరోసారి ఆయన చర్చించే అవకాశం ఉంది. కాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా భారం పెరుగుతుంది అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎవరికి కరోనా వచ్చినా అక్కడికే వెళ్ళాలి అని ప్రభుత్వం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: