అస్సాం రాష్ట్రంలోని గ్యాస్ బావి వద్ద చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు అక్కడి ప్రభుత్వంతో కలిసి కేంద్రం కూడా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. 

 

అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలోని బాగ్జాన్ వద్ద ఉన్న ఆయిల్ ఇండియా లిమిటెడ్ గ్యాస్ బావి వద్ద మంటలు చెలరేగడంతో సైన్యం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఇందులో ఇద్దరు చనిపోయారని అస్సాం మంత్రి చంద్ర మోహన్ పటోవరీ తెలిపారు. సుమారు 7,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని... చాలా మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన పేర్కొన్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: