ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ దేశం ప్రకృతి వైపరిత్యాలతో పోరాడుతోందని అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పర సహకారం అవసరమని వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్లాల్సిందేనని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని... కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పోరాటం కొనసాగుతోందని.... ఇది పరీక్షా కాలమని అన్నారు. 
 
ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. నిరంతరం గెలుపు కోసం ప్రయత్నిద్దామని.... మన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించే సమయమిదని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ స్పూరితో ముందుకెళదామని అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందుకెళ్లడమే ముఖ్యమని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: