వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపు చేస్తున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఇప్పటికే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు.  అయితే  ఉత్తమ్ కుమార్ ఇంటిని కూడా పోలీసులు అష్టదిగ్భందం చేశారు. దాంతో  ఉత్తమ్‌ మండిపడుతూ తన ఇంటి వద్ద ఉన్న పరిస్థితులపై ఓ వీడియో పోస్ట్ చేశారు. 

uttam kumar reddy fires on trs

ఇవాళ పొద్దుటి నుండి పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను అకారణంగా గృహ నిర్బంధం చేసిన్రు. మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? ప్రజాస్వామ్యవాదులను చూసి కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు?' అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: