ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నాకు దేవుడు అని విశాఖ డాక్టర్ సుధాకర్ అన్నారు. తాను ప్రధాని మోదీ గారిని కూడా నేను తిట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా? ప్రశ్నించారు. శత్రువులను కూడా నేను తిట్టనని అన్నారు. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టమన్నారు. అలాంటి నాయకుడ్ని తిడతానా? అన్నారు ఆయన. 

 

ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారని కొనియాడారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదని స్పష్టం చేసారు. చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారన్నారు. ఆయన హయాంలో కూడా పని చేశానన్న ఆయన... చంద్రబాబు కార్యకర్తనైతే కాదని స్పష్టం చేసారు. అందరూ బాగానే పాలించారన్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: