దేశంలో కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో ప్రతి రోజూ వార్తలు చూస్తుంటే తెలుస్తుంది.  అయితే ఆ వార్తలను తీసుకు వచ్చే జర్నలిస్టులకు కూడా కరోనా సోకడం చనిపోవడం కూడా జరిగింది.  అలా విధినిర్వహిస్తున్న ఎంతో మంది జర్నలిస్టులు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు వైద్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ఓ ప్రత్యేకమైన వార్డును ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి నుంచి కరోనాపై డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు యుద్దం చేస్తూ తమ విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  వీరితో పాటు జర్నలిస్టులు కూడా ఎంతో ధైర్యంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు.  

 

ఈ క్రమంలో కొంత మంది వైరస్ భారిన పడుతున్న విషయం తెలిసిందే.  అందుకే జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారికి ఎప్పటికప్పుుడ పరీక్షలు నిర్వహించి  ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అంతే కాదు జర్నలిస్టుల కోసం గాంధీ ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన వార్డును ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్‌ పేరును వార్డుకు నామకరణం చేసారు.

 

ఇక ఇప్పటికే రాష్ట్రంలో 16 మంది మీడియా మిత్రులకి కరోనా వైరస్‌ సోకగా, వారిలో ఓ యువజర్నలిస్టు సకాలంలో వైద్యసేవలు అందక మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. సచివాలయ బీట్‌ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: