ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాల్లో నగదు మాయమవుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే . స్థానిక దిలార్‌భాయ్‌ వీధికి చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా అనే వ్యక్తి స్వీట్‌ స్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. 
 
కొద్దిరోజుల క్రితం మహబూబ్ బాషాకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మీ ఫోన్‌పే యాప్‌ గడువు తీరిందని, వివరాలు తెలిపితే తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పాడు. ఏటీఎం కార్డ్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ చెబితే ఖాతా పని చేస్తుందని చెప్పడంతో మహబూబ్ బాషా అపరిచిత వ్యక్తికి ఆ వివరాలను చెప్పాడు. అనంతరం అపరిచిత వ్యక్తి మహబూబ్‌ బాషా సెల్‌ఫోన్‌కు ఒక లింక్‌ పంపి ఫోన్... లింక్ ఓపెన్ చేస్తే ఫోన్‌పే పునరుద్ధరణ జరుగుతుందని చెప్పాడు. ఆ లింక్ ఓపెన్ చేసిన అనంతరం రూ.1,03,900 రూపాయలు ఖాతా నుండి మాయం కావడం మహబూబ్ బాషా షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు మహబూబ్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: