ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది. సబ్ కమిటీ సూచనల మేరకు కేబినెట్ సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్సార్‌ చేయూత పథకానికి కేబినెట్ పథకానికి పోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 75 వేల రూపాయల సాయం అందించనుంది. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. మొదటి దశలో పోర్టుకు రూ.4,736 కోట్ల వ్యయం అవుతుందని... . ఆగష్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: