మన దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి.  మొదట కేరళాలో వచ్చింది.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా మొత్తం చుట్టేసింది.  మార్చి నెల నుంచి దేశంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్నారు. కాకపోతే కరోనా ఎవ్వరినీ వదలడం లేదు.. రక్షించే వారిని కూడా కరోనా ఎటాక్ చేస్తుంది.  ఇప్పటికే పలువురు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కరోనా భారిన పడ్డారు.  కొంత మంది చనిపోయారు.  తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ పంజా విసురుతోంది.

IHG

తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి.  ముక్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు  కరోనా బారిన పాడగా... తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు పోలీసులకి కరోనా పాజిటివ్ గా తేలింది.

IHG

ఈ ఘటన పోలీసు శాఖకు దిగ్భ్రాంతి కలిగించింది.  అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించి... అందరినీ క్వారంటైన్ కు తరలించారు. వారందరి శాంపిళ్లను సేకరించి, కరోనా టెస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: