కరోనా వైరస్‌ రష్యాను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యా రోజు రోజు కీ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి పైగా నిరుద్యోగులుగా మారారని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, షాపులకు అద్దెలు చెల్లించలేక నానా అగచాట్లు పడుతున్నారు.  ఈ పరిస్థితి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నది. 

 

 

 మిగతా ప్రాంతాలతో పోలిస్తే రష్యాలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.   రష్యాలోని బార్లు, రెస్టారెంట్లు, కెఫేల యజమానులు, షెఫ్ లు కనీస నెలవారీ ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో రోడ్డున పడ్డ ఎంతో మంది ఉద్యోగులు తమ గోడు వినిపించేందుకు రోడ్డెక్కారు. వీరంతా తమ నిరసనలను వినూత్నంగా తెలుపుతూ, అందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.

 

 వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు నగ్న ప్రదర్శనలకు దిగారు. మామూలుగా అయితే ప్రజలకు తమ కష్టాలు ఎలా తెలుస్తాయని భావించి ఏకంగా నగ్నంగా ప్రదర్శన చేశారు.   కాకపోతే..  పూర్తి నగ్నంగా కాకుండా, ప్లేట్లు, కప్పులు, బాటిళ్లు, కుర్చీలను కాస్తంతా అడ్డుగా పెట్టుకున్నారు లెండి. తమకు పని కల్పించాలన్నదే ఇప్పుడు వారి డిమాండ్. వీరిని చూసి జాలి పడటం తప్ప ప్రస్తుతానికి చేసేదేముందని చూసే వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: