బీహార్ లో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో జేడియు, బిజెపి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఈ సందర్భంగా బీహార్ సిఎం నితీష్ కుమార్  కీలక వ్యాఖ్యలు చేసారు. లాలూ - రబ్డీ దేవి పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బతికారని, వారిద్దరి భార్యా భర్తల 15 ఏళ్ల పాలనలో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

వారిద్దరి పాలనలో మతపరమైన అల్లర్లు, కుల పరమైన ఊచకోతలు జరిగాయన్నారు. ఆ 15 ఏళ్ల కాలంలో క్రైం రేటు కూడా విపరీతంగా పెరిగిపోయిందని ఈ సందర్భంగా ఆరోపించారు. కాగా బీహార్ లో గత ఎన్నికల్లో జేడియు ఆర్జెడి కలిసి అధికారంలోకి రాగా ఆ తర్వాత విభేదాలతో రెండు పార్టీలు దూరమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: