శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేస్తున్న ఏఈవోలను సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో ఏఈవోలు మోహన్ మరియు శ్రీనివాస్ రెడ్డి ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో వారిని సస్పెండ్ చేసినట్టు గుడి యాజమాన్యం తెలియజేసింది. వీరు ఇద్దరు కూడా శ్రీశైలం లో పనిచేస్తూ బదిలీమీద శ్రీకాళహస్తి కి వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. అయితే శ్రీశైలం భ్రమరాంబ ఆలయ కుంభకోణంలో 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేసింది ఆలయ కమిటీ.  

 

 

అయితే తాజా వ్యవహారం పై వీరిద్దరితో పాటు ఆంధ్ర బ్యాంక్ మరియు ఇతర ఏజెన్సీల ఉద్యోగులను కలుపుకొని మొత్తం 30 మంది పై క్రిమినల్ కేసులు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వీరు కాజేసిన సొమ్మును రికవరీ చేయవలసిందిగా ఆదేశించింది. మొత్తం 2 కోట్ల 56 లక్షల అక్రమార్జనకు ఈ ఇద్దరు ఏఈవోలు  పాల్పడినట్లు వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: