బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాలోకి రావాలంటూ అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం భారీ స్థాయిలో ఉంటుందంటున్నారు అభిమానులు. అయితే బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఆలస్యానికి కారణం మోక్షజ్ఞ కి నటన పట్ల ఉన్న అయిష్టతేనని అంటున్నారు. అయినప్పటికీ కుటుంబసభ్యులు ఆయన్ని కన్వీన్స్‌ చేయడానికి ప్రయత్నించినా కుదరలేదు.

 

 

తాజాగా నటరత్న బాలకృష్ణ తన 60 వ పుట్టినరోజు జరుపుకున్నవిషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలలో మోక్షజ్ఞ తన తండ్రి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించాడు. అయితే ఈ సందర్భంగా మోక్షజ్ఞను చూసిన అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఎందుకంటె మోక్షజ్ఞ  షేప్‌ అవుట్‌ ఫిజిక్‌తో కనిపించడం అభిమానులను నిరాశపరిచింది. దింతో నిజంగానే మోక్షజ్ఞకు నటన పట్ల ఆసక్తి లేదా? అసలు ఆయన సినిమాల్లోకి వస్తాడా? రాడా అనే చర్చలు మొదలయ్యాయి. ఇక  బాలకృష్ణ కూడా తన వారసుడి ఎంట్రీపై సరైన క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. IHG

మరింత సమాచారం తెలుసుకోండి: