తెలంగాణ లో లాక్ డౌన్ ఎత్తివేసిన నాటినుండి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయ్. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే గురువారం అంతాకూడా అతడు జిహెచ్ఎంసీ మేయర్ తో కలసి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సదరు వ్యక్తి ఎవరితో కాంటాక్టులో ఉన్నాడో అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అతని కుటుంబాన్ని క్వారంటైన్ కి తరళించారు.

 

రేపు మేయర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం బొంతు రామ్మోహన్ కి కరోనా పరీక్షలు నిర్వహించగా అప్పుడు కరోనా నెగటివ్ తేలిన విషయం తెలిసిందే. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మేయర్‌ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్ట​ర్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న అధికారులు వెంటనే ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ రిసల్ట్స్ వచ్చాయి. దింతో అధికారులు ఒక్కసారిగా ఉపిరి పీల్చుకున్నారు. మరి ఇప్పుడు అయన కారు డ్రైవర్ కి కరోనా సోకినా నేపథ్యంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: