తెలంగాణా ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న సిబ్బంది సేవలను వాడుకోవడానికి గానూ బస్ పాస్ కౌంటర్లలో కండక్టర్లు, డ్రైవర్లను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. అర్హులు అయిన సిబ్బంది నుంచి దరఖాస్తులను కూడా  ఆహ్వానించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ప్రస్తుతం నెట్‌ ఎక్సెల్‌ అనే ప్రైవేటు సంస్థ బస్‌ పాస్‌ కౌంటర్లను నిర్వహిస్తూ ఉండగా ఈ సంస్థకు ఒక్కో పాస్ చొప్పున ఆర్టీసి కమీషన్ ఇస్తుంది. 

 

ఈ సంస్థ కాంట్రాక్ట్ 2015 జూన్‌ 9 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మిగులు సిబ్బందిని వాడుకోవాలి అని సిఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలోనే ఆర్టీసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: