టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గానూ వంద మంది ఏసీబీ అధికారులు వచ్చినట్టు  తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడ లో ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన మంత్రి గా ఉన్న సమయంలోనే ఈఎస్ఐ లో మందుల కొనుగోలు స్కాం జరిగింది అని అధికారులు గుర్తించారు. 

 

మొత్తం 988 కొట్లలో ఆయన కొనుగోలు పాత్ర ఉందని ఇక ఆయన 150 కోట్ల వరకు స్కాం చేసారు అని అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్ లతో ఆయన మందులు కొనుగోలు చేసారు అని తెలుస్తుంది. దీనిపై ఆయన కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: