టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కాం లో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మందులు ల్యాబ్ పరికరాలను నకిలీ కొటేషన్ ఇచ్చి కొనుగోలు చేసారు అని అధికారులు గుర్తించారు. ఇక ఆయన తో పాటుగా మరో మాజీ మంత్రిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

 

సదరు మాజీ మంత్రి కుమారుడు ఈ స్కాం లో ఉన్నాడు అని అధికారులు గుర్తించారు. ఆయనకు కూడా ఇందులో వాటా ఉంది అని సమాచారం. త్వరలోనే ఆయనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా అచ్చెన్న అరెస్ట్ ని విజయవాడలో చూపనున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: