దేశంలో ఇప్పుడు కరోనా ప్రభావంతో జనాలు చచ్చిపోతున్నారు.. లక్షల మందికి కరోనా భారిన పడుతున్నారు. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించారు.. దాంతో చాలా మంది ఇంటి పట్టున ఉంటున్నారు.  ఇక టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిన్న నుంచి ముదుసలి వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. కొంత మంది చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  ఇలా ఎన్నో దారుణమైన సంఘటనలకు టిక్ టాక్ వేదిక అయ్యింది.  ఒకదశలో టిక్ టాక్ బ్యాన్ చేయమని అంటున్నారు. 

 

తాజాగా టిక్‌టాక్ ద్వారా పేరు సంపాదించుకోవాలన్న తపన ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కర్ణాటకలోని హోసూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన వెట్రివేల్ (22) డిగ్రీ చదువుతున్నాడు. మామూలుగా అయితే జనాలను ఆకర్షించలేమని ఓ దిక్కుమాలిన ప్రయోగం చేశాడు.  

 

ఇందులో భాగంగా బతికున్న చేపను మింగుతూ వీడియో చేశాడు. అయితే, చేప కాస్తా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక గిలగిల్లాడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.. ఆ యువకుడు మృతి చెందాడు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: