టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అధికారులు స్పందించారు. అచ్చెన్నాయుడు పాత్ర ఉంది అని విచారణలో తెలిసింది అని అధికారులు పేర్కొన్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ళు విషయంలో 150 కోట్ల అవినీతి జరిగింది అని అధికారులు వెల్లడించారు. ఈఎస్ఐ పై విజిలెన్స్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చిందని తాము అందుకే అదుపులోకి తీసుకున్నాము అని ఏసీబీ పేర్కొంది. 

 

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారు అని దర్యాప్తు లో తెలిసింది. అనవసరంగా పరికరాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేసారు అని పేర్కొన్నారు. నిధులను దారి మళ్ళించారు అని పేర్కొన్నారు. బయోమెట్రిక్ మెషిన్ విషయంలో నిధులు దుర్వినియోగం చేసారు అని ఆరోపణలు చేసారు. సీకే రమేష్ బంధువుల పేరుతో బిల్లులను సృష్టించారు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: