టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కి సంబంధించి ఏసీబీ అధికారులు స్పందించారు. ఈఎస్ఐ స్కాం లో ఆయన పాత్ర ఉంది అని ధర్యపతులో తేలింది అంటూ అధికారులు వివరణ ఇచ్చారు. సీకే రమేష్ బంధువుల పేరుతో నకిలీ బిల్లులను సృష్టించారు అని అన్నారు. ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్న సహా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 

 

అచ్చెన్నను ఏసీబీ కోర్ట్ లో హాజరు పరుస్తామని చెప్పారు అధికారులు. మందులను 50 శాతం నుంచి 130 శాతం ధరకు కొనుగోలు చేసారు అని పేర్కొన్నారు. బిల్లులు ఎక్కువగా నకిలీవి అని వ్యాఖ్యానించారు. 988 కొట్లలో 150 కోట్ల అవినీతి జరిగింది అని తెలిసింది అంటూ అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ లో కొనుగోలు చేసారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: