టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆయన భార్య మాధవి స్పందించారు. ఉదయం 5;30 నిమిషాలకు అధికారులు వచ్చారు అని ఆమె అన్నారు. 15 కార్లు బస్సు లో పోలీసులు  వచ్చారు అని ఆమె పేర్కొన్నారు.  తాము మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళారు అని ఆమె ఆరోపించారు. 

 

గన్ మెన్ ని నరసన్న పేట నుంచే వెనక్కు పంపించారు అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆయన సర్జరీ చేయించుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోగ్యం సరిగా లేదని అన్నారు. ఒక్కసారిగా మీద పడిపోయారు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక అచ్చెన్న కుమారుడు కూడా స్పందించారు. నాన్నను బలవంతంగా తీసుకుని వెళ్ళారు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: