దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి చర్యలు ఏ మాత్రం కూడా ఫలితం ఇవ్వడం లేదు. దేశంలో తొలిసారిగా కరోనా కేసులు అధికారికంగా దాదాపు 11 వేల వరకు నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో అత్యధికంగా 10,956 కొత్త కేసులు & 396 మరణాలు సంభవించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటిలో 141842 క్రియాశీల కేసులు, 147195 నయం / డిశ్చార్జ్ అయిన కేసులు అని పేర్కొంది. 8498 మంది ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని మొత్తం కరోనా కేసుల సంఖ్య 297535 గా ఉందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: