భారత దేశంలో ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయని అంటున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తుంది. కంటికి కనిపించని వైరస్ చాపకింద నీరులా అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు, మరణాలు కూడా బాగానే సంబవిస్తున్నాయి.  కరోనా మొదలైనప్పటి నుంచి  అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసులు,పారిశుద్ద్య కార్మికులు, జర్నలిస్టులు కరోనాని కట్టడి చేయడానికి ఎంత కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. 

 

అయితే వీరినీ కరోనా వదలడం లేదు.. ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు ఈ మద్య ఓ విలేఖరి కూడా చనిపోయారు. దీంతో నాయకులు, అధికారులు, జిల్లాల కలెక్టర్లు కూడా హోం క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.  ఈ మధ్య కాలంలో జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా వారితో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.

 

ఈ విషయం గురించిన సమాచారం రావడంతో వెంటనే కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు. అదే విధంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా రాకుండా జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలని.. దీనికి వ్యాక్సిన్ ఇంకా రాలేదన్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: