ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మంత్రి krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ తప్పుబట్టారు. అరెస్ట్‌ చేస్తే కిడ్నాప్‌ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. నేరం జరిగినప్పుడు అరెస్ట్‌ సర్వ సాధారణం అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

అదే విధంగా చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని తప్పుబట్టారు. తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి బీసీలకు ఆపాదిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు వారిని గాలికొదిలేశారని ఆరోపణలు చేసారు. సిఎం వైఎస్ జగన్  బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: