ఎప్పటి నుంచో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టు పనులను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వంతో జిఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు జరిగిన సమావేశంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జిఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జిఎంఆర్ చైర్మన్ జి  బిఎస్ రాజు ప్రాజెక్ట్  కోసం సంతకాలు చేశారు.

 

IHG's Bhogapuram <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AIRPORT' target='_blank' title='airport-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>airport</a> | The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> Minute

ఇంకా ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి,  ఏపీఐఐసి  చైర్మన్ ఆర్ కే రోజా. ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిఎంఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం గారు ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మిస్తామని సీఎంతో అన్నారు. తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ నిర్మాణం కోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటామని జిఎంఆర్ ప్రతినిధులు జగన్ కి మాట ఇచ్చారు.

IHG

 

 భోగాపురం ఎయిర్ పోర్టు  నిర్మాణం కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.... ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయాలు కలుగుతాయని అన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేస్తామని కూడా సీఎం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నానికి వీలైనంత వేగంగా మరియు సులభతరంగా ఇంకా సౌకర్యవంతంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని వైయస్ జగన్ చెప్పారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాట్లను చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు అదేవిధంగా అందుకు తగిన చర్యలను తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: