ఉత్తరాఖండ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశం ఆ రాష్ట్రంలో దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. కరోనా కట్టడిలో ఇప్పుడు చాలా సమర్ధవంతంగా వ్యవహరించిన రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. అయినా సరే కేసులు మళ్ళీ వేగంగా పెరుగుతున్నాయి. 

 

ఇక తాజాగా మరోసారి భారీగా అక్కడ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరాఖండ్ ఈ రోజు 37 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1692 కి చేరుకుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అక్కడ రికవరీ రేటు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: