లాక్ డౌన్ సమయం లో కరోనా కాస్త కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించినా లాక్ డౌన్ సడలింపు తర్వాత కరోనా కేసులు ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.   కరోనా విషయంలో కేజ్రీవాల్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి పార్టీ  అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో రోగులు అల్లాడిపోతున్న తరుణంలో ఢిల్లీ సర్కార్ పనితీరు చాలా దారుణంగా ఉందని భారత జనతాదళ్ పార్టీ అభిప్రాయపడింది. ఢిల్లీలోని ఆస్పత్రుల్లో సరైన బెడ్ సౌకర్యం లేక మరియు సరైన  చికిత్స అందక రోగుల ఇబ్బందులు పడుతున్నారని మరియు ఆసుపత్రులు అధ్వాన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బిజెపి పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు.

IHG

 

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను అంచనా వేయాలని సంబిత్ పాత్ర సూచించారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో చెత్తకుప్పల్లో మృతదేహం లభ్యం విషయమై కోర్టు చురకలు అంటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అదేవిధగా ఢిల్లీలో టెస్ట్ లు ఎందుకు తక్కువగా చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చనిపోయిన రోగుల విషయంలో వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించాడు.

 

కరోనాపై రాజకీయాలు చేయడం మాని కరోనా రోగుల విషయంలోమరియు  అందించే చికిత్స విషయంలో  కేజ్రీవాల్ సర్కార్ దృష్టి సాధించాలని సూచించారు. అదేవిధంగా ప్రెస్మీట్ కాన్ఫరెన్స్ లకు పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవ విషయాలను గమనించాలని ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు సంబిత్ పాత్ర  సూచించారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చిన కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: