ఆసియా కప్ కోసం పాకిస్థాన్ గడ్డపైకి భారత ఆటగాళ్లను  రప్పించు కోవాలనుకుంటున్న  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పంతం  నెగ్గించు లేకపోయింది.   ఈ సంవత్సరం షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నెలలో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. పాకిస్తాన్ మరియు భారత దేశాల మధ్య సామరస్య వాతావరణం లేకపోవడంతో ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది...... దీంతో మొదట బెదిరింపులకు పాల్పడిన పాకిస్థాన్... ఆ తర్వాత బుజ్జగింపులకు దిగింది.... అయినప్పటికీ భారత్ ససేమిరా అనడంతో పాకిస్తాన్  సైలెంట్ గా ఉండిపోయింది.

IHG
 భారత్ మాత్రం తటస్థ వేదికలపై పాకిస్తాన్ తో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో శ్రీలంకలో   ఆ టోర్నీ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీలంక వెల్లడించింది. అయితే పాకిస్తాన్ మాత్రం మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ ఆ తర్వాత ఒప్పుకోవలసి వచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ లో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్  సిల్వా... శ్రీలంక లో ఆసియా కప్ 2020 నిర్వహించేందుకు పాకిస్తాన్ ఓకే చెప్పిందని వెల్లడించాడు. అదే మీటింగ్ లో ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.... ఆ సమయంలో మౌనంగా ఉండటం తో ఆసియా కప్ 2020 నీ శ్రీలంకలో నిర్వహించేందుకు అంగీకారం తెలిపినట్లు అయ్యింది. అయితే ఈ టోర్నమెంట్ ఆడకపోతే పాకిస్తాన్ కి  ఆర్థిక నష్టం తప్పదని భావించిన పాకిస్తాన్ బోర్డర్ పిసిబి  భారత్ తో ఆసియా కప్ 2020 ఆడేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: