అన్నదాత పత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు  గుండెపోటుతో కన్నుమూశారు.  హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1987 నుంచి 2017 అక్టోబర్ వరకు అన్నదాత పత్రిక  సంపాదకులుగా మూడు దశాబ్దాలపాటు పత్రికను దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ గలిగిన పత్రిక గా నిలిపారు. డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

IHG

 

 గురువారం రోజున చాతి నొప్పితో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఓ భార్య మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణాజిల్లా వీరులపాడు లో 1927 ఆగస్టు 13న జన్మించారు. 1960లో పశు పోషణలో అధ్యయనం కోసం  ఆస్ట్రేలియా కి భారత ప్రభుత్వం పంపించింది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్  పశుసంవర్ధక శాఖలో వివిధ స్థాయిల్లో  విధులను   నిర్వర్తించారు. ఆ తరువాత  సంవర్ధకశాఖలో సంచాలకులుగా 1985లో పదవి విరమణ చేశారు. నిరంతరం అన్నదాతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈనాడు  అన్నదాత దినపత్రికలో  సంపాదకుడిగా 1987 నుంచి 2017 వరకు అన్నదాత పత్రిక సంపాదకులుగా సేవలందించారు.  

 

 

ఈనాడు అన్నదాత పత్రికలో అనేక వ్యాసాలు రచించారు. ఈయన కృషిని గుర్తించి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో నమస్కారాలు ఈయనను వరించాయి.   వ్యవసాయ రంగంలో ఈయన చేసిన కృషికి గాను డాక్టర్ సి కె రావు ట్రస్ట్ పురస్కారం, 1994లో ప్రతిష్టాత్మక డాక్టర్ నాయుడమ్మ అవార్డు ను మరియు  డాక్టర్ రఘురాం రెడ్డి అవార్డు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. విరామం ఎరుగని నిత్య కృషీవలుడు గా రైతు బాంధవుడిగా మనసు గెలుచుకున్న డాక్టర్ రెడ్డి నారాయణ రావు  అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: