ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. కీలక అధికారులను  బదిలీ చేసే అవకాశం ఉంది అని సమాచారం.  పలు జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. కృష్ణా గుంటూరు తో పాటుగా రాయలసీమ జిల్లాలకు చెందిన ఎస్పీలను  బదిలీ చేసే సూచనలు ఉన్నాయి అని తెలుస్తుంది. 

 

దీనికి సంబంధించి నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం జాబితా సిద్దంగా ఉంది అని తుది మెరుగులు దిద్ది సాయంత్రం విడుదల చేసే సూచనలు ఉన్నాయి  అని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: