తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మంత్రి హరీష్ రావు పీఏకి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. పీఏకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన 51 మంది శాంపిళ్లను వైద్య సిబ్బంది సేకరించారు. వీరిలో 17 మందికి నెగిటివ్ నిర్ధారణ కాగా మిగిలిన వారి రిపోర్టులు అందాల్సి ఉంది. 
 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చక్కబెడతానని.... వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటానని హరీష్ రావు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో, యాదాద్రి జిల్లా కలెక్టర్ హోం క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కూడా నిన్న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: