టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని 14 రోజుల రిమాండ్ విధించారు. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆయన కలపర్రు టోల్ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అంటూ కేసులు నమోదు చేసారు పోలీసులు. ఆయనతో పాటుగా మరి కొందరి మీద కూడా కేసులు పెట్టారు. 

 

ఆయన మీద మొత్తం 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. 355,143 సహా పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేసి కాసేపటి క్రితం జడ్జి ముందు ప్రవేశ పెట్టగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనకు కరోనా టెస్ట్ కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: