చైనాలో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా మొదలవుతుంది కరోనా కట్టడికి అక్కడ చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కేసుల సంఖ్య క్రమంగా  పెరుగుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. ఆ దేశ రాజధాని నగరం బీజింగ్‌లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

 

దీనితో అప్రమత్తమైన అధికారులు అక్కడ లాక్ డౌన్ ని విధిస్తున్నామని ప్రకటించారు. జిన్ఫాడీ మీట్ అనే మార్కెట్ లో ఏడు కరోనా కేసులను ఇప్పటి వరకు గుర్తించారు అధికారులు. ఆరు కేసులు ఈ ఒక్క రోజే వచ్చాయి అని అధికారులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: