టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కి సంబంధించి ఏసీబీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేసారు ఆయన అరెస్ట్ కి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి ఆధారాలు సేకరించామన్న ఏసీబీ జెడి రవి కుమార్... అవకతవకలు చేసినట్లు గుర్తించామని అందుకే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసామని చెప్పారు. 

 

ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసామని పేర్కొన్నారు. లబ్ది పొందిన వారి పాత్ర మీద కూడా విచారణ చేస్తామని స్పష్టం చేసారు. ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జేడీ జనార్ధన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్‌ చేసామని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: