వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌, సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌, క్లియరింగ్‌ చాట్‌ ఫీచర్లను వాట్సాప్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వేరువేరు డివైస్ లలో వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. 
 
ఒకే సమయంలో వివిధ డివైస్‌ల నుంచి చాట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఒక చోట లాగిన్‌ అయ్యి మరొకరు లాగ్ ఇన్ కావాలంటే ఖచ్చితంగా లాగ్ ఔట్ అవ్వాల్సి ఉండేది. సరికొత్త 'సెర్చ్ బై డేట్ ఆప్షన్' ను కూడా వాట్సాప్ తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని సమాచారం. సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తే వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: