తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ కుంభకోణం పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎంతో గౌరవంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటుంది.. అధికారులపై నమ్మకాన్ని పెంచుకుంటుంది.  కానీ కొంత మంది ఈ రెండు విషయాల్లో ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు.  డబ్బు మాత్రమే పరమావధిగా బడా బడా స్కాములకు పాల్పపడుతూ చట్టానికి చిక్కిపోతున్నారు.  ఈఎస్ ఐ మందుల స్కామ్ లో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీపీఎం నేత మధు అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని, స్కామ్ కు సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు.

 

చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సామాన్యులు ఎవరినైనా శిక్షిస్తుందని అన్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో బాధ్యులు ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్నారని అన్నారు. ఏపీలో కొంచెం ఆలస్యమైందని చెప్పారు. ఇక్కడ కూడా విచారణ జరిపిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగిందని... అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖ ఆధారంగానే అరెస్టులు జరిగాయని తెలిపారు.  అయితే ఈ విషయాల్లో రాజకీయ జోక్యం ఎప్పటికీ ఉండదని.. ఏ రాజకీయ నాయకుడైనా అవినీతికి పాల్పపడితే శిక్ష అనుభవించి తీరుతారని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: