దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం, విభిన్న ఫలితాలు ఆశించడం పిచ్చితనం అని రాహుల్ గాంధి ఆరోపించారు. కోవిడ్-19 మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత దేశంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదవుతున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.

 

 భారత దేశం తప్పుడు పోటీలో విజేతగా నిలిచేందుకు దూసుకెళ్తోందని ఆయన ఎద్దేవా చేసారు. అహంకారం, అసమర్థత ప్రాణాంతకంగా కలగలిసిన ఫలితం ఈ భయానక విషాదమని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసారు. ఇక కేసులు పెరుగుతున్న విధానాన్ని కూడా ఆయన గ్రాఫ్ ల ద్వారా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: