రాష్ట్ర ప్రభుత్వం అడవుల విషయంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుంది అని, భారీగా అడవులను పెంచడమే లక్ష్యం అని తెలంగాణా సిఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిచేస్తున్న అర్బన్‌ఫారెస్ట్‌ పార్కులు రానున్నరోజుల్లో ఆక్సీజన్‌ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ఆయన అన్నారు. 

 

మేడ్చల్‌ జిల్లాకండ్లకోయలో ఉన్న ఆక్సీజన్‌ అర్బన్‌ ఫారెస్ట్‌పార్కును  ఆయన పరిశీలించారు. దాదాపు ఆయన మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. పూర్తిగా అభివృద్ధి చేసిన ఆక్సీజన్‌ పార్క్‌ అత్యంత ఆహ్లాకరంగా ఉందన్నారు ఆయన. ప్రకృతి స్వర్గంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పెద్దమొత్తంలో అటవీ భూములు ఉన్నాయని, ఔటర్‌రింగ్‌రోడ్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో 59 అర్బన్‌ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: