గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్స్, రిలీజ్ లు అన్నీ ఆగిపోయాయి. ఈ మద్య కొన్ని రాష్ట్రాల్లో షూటింగ్ లకు పరిమిషన్ ఇస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు జరిగాయి.  ప్రముఖ బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు కన్నుమూశారు. ఈ మద్య కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఇలా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ కెమెరామెన్ బి.కన్నన్ తుదిశ్వాస విడిచారు.

 

గుండె సంబంధ సమస్యలతో చెన్నైలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. తమిళం, మలయాళంలో 50కి పైగా సినిమాలకు ఆయన పని చేశారు. కన్నన్ మృతితో చిత్ర పరిశ్రమలో ఆవేదన నెలకొంది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు.ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి 40 సినిమాలకు పని చేశారు.   రేపు అంత్యక్రియలను నిర్వహిస్తారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: