టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ని అనంతపురం జిల్లా కోర్ట్ లో పోలీసులు హాజరు పరిచారు. జడ్జి ఎదుట ఆయన అరెస్ట్ ని చూపించారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డికి కూడా  14 రోజుల రిమాండ్ విధించారు. 

 

వీరు ఇద్దరినీ పోలీసులు అనంతపురం జిల్లా అజైలుకి తరలించారు. కాగా నేడు ఉదయం ఇద్దరినీ హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వారిని రోడ్డు మార్గంలో అనంతపురం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారించారు పోలీసు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: