మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే ముంబై సహా పలు ప్రాంతాల్లో వందల్లో వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు ఇప్పుడు లక్ష దాటాయి. నిన్న ఒక్క రోజే అక్కడ దాదాపు 3500 కేసులకు పైగా నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యమో మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే ని ఆ రాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసారు. కరోనా నియంత్రణ చర్యల మీద ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాగా అక్కడ కరోనా టెస్ట్ లు తక్కువ జరుగుతున్నాయి అని ఫడ్నవీస్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: