తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 253 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. 
 
ఆసుపత్రులతో పాటు  వైరస్ నిర్దాణ కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. 5 వేల వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని... రాష్ట్రంలో 25 వేల వరకు పడకలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గాంధీ ఆసుపత్రి (కోవిడ్ నోడల్ కేంద్రం), కొండాపూర్‌, రంగారెడ్డి జిల్లా ఆసుపత్రులు... కింగ్ కోఠి, హైదరాబాద్ జిల్లా ఆసుపత్రి.... ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి.... పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు కరోనా వైద్య సేవలు అందనున్నాయి. 
 
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, పంజాగుట్ట నిమ్స్, సీసీఎంబీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలలో కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: