ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. మిగతా జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాలో గత కొన్ని రోజులుగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు విజయవాడ నగరంలోని 64 డివిజన్లలో 42 డివిజన్లను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేడు కంటైన్మెంట్ జోన్లలో ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు మాత్రమే మాంసం, చేపల దుకాణాలు ఉంటాయని ప్రకటించింది. 
 
నాన్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేపలు, మాంసం విక్రయాలు కొనసాగుతాయని పేర్కొంది. సాధారణ రోజులతో పోలిస్తే ఆదివారం మాంసం, చేపల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. పరిమిత సమయం మాత్రమే అనుమతులు ఇవ్వడం వల్ల రోడ్లపైకి మాంసం, చేపల కొనుగోలు కోసం వచ్చే జనం సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: