తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కడప జైలుకు తరలించారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్ లో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఉదయం 11 గంటలకు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 
 
నిన్న సాయంత్రం వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే రెడ్డిపల్లి జైలులో ఒక ఖైదీలో కరోనా లక్షణాలు కనిపించడంతో పోలీసులు ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి వారిని తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు. అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు వారిని కడప జైలుకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: