ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అగ్రరాజ్యం అమెరికాలో 25,302 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. 
 
అమెరికా తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ లో గత 24 గంటల్లో 20,894 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్ లో 20,000కు పైగా కేసులు నమోదు కాగా 11,929 కేసులతో భారత్ గత 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో గత 24 గంటల్లో నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. కేసుల పరంగా ఇండియా తరువాత స్థానంలో రష్యా ఉంది. రష్యాలో గత 24 గంటల్లో 8,706 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: