ప్రపంచం మొత్తం కరోనాతో వణికి పోతుంది.  ఇప్పటికే లక్షల్లో చావులు, కేసులు నమోదు అవుతున్నాయి.  మరోపక్క ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  దారుణంగా దాడులకు పాల్పపడుతున్నారు. తాజాగా  నైజీరియా దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు సంస్థల ఇస్లామిక్ మిలిటెంట్లు నైజీరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 20 సైనికులు, 40 మంది పౌరులు మరణించారు.  దాడి జరిగిన చోట రక్తసిక్తం అయ్యింది.. మృతులంతా చెల్లా చెదురుగా పడి పోయారు.  ఆర్తనాదాలతో కన్నీరు మున్నీరు అవుతు్నారు.  

 

మాంగునో, నాగన్ జాయ్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. రాకెట్ లాంఛర్లతో ఉగ్రవాదులు దాడులు జరపడం గమనార్హం. ఈ దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మిలిటెంట్లు స్థానిక పోలీసుస్టేషన్ ను కూడా దహనం చేశారు.  ఈ మద్య భారత్ లో కూడా ఉగ్రమూకలు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: